బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అందరు అనుకుంటారు. అందరి బాటలోనే దేత్తడి హారిక వెబ్ సీరీస్ లతో అదరగొడుతుంది. తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన వైరల్లీ వీడియోస్ తోనే ఈసారి ఓ వెబ్ సీరీస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హారిక అలేఖ్య. ఏవండోయ్ ఓనర్ గారు అంటూ ఎపిసోడ్స్ చేస్తూ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. హౌజ్ ఓనర్, అందులో రెంట్ కు ఉండే అబ్బాయి ప్రేమ కథగా ఏవండోయ్ ఓనర్ గారు వెబ్ సీరీస్ నడుస్తుంది. ఈ వెబ్ సీరీస్ తో హారిక తన క్రేజ్ డబుల్ చేసుకుంటుందని చెప్పొచ్చు.

ఇక మధ్య మధ్యలో తన గ్లామర్ టచ్ తో ఆడియెన్స్ ను నిద్ర పట్టకుండా చేస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు అలరిస్తుంది. లేటెస్ట్ గా హారిక పింక్ కలర్ శారీతో గ్లామర్ లుక్ అదిరిపోయింది. తనలోని ఈ యాంగిల్ ఆడియెన్స్ కు పరిచయం చేస్తుంది అమ్మడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన స్టైల్ ఆఫ్ డ్రెసింగ్ తో అందరిని అలరించిన హారిక లేటెస్ట్ శారీ లుక్ తో మాత్రం అదరగొట్టిందని చెప్పొచ్చు. హారిక శారీ లుక్స్ చూసిన వారంతా వావ్ అనేస్తున్నారు. కొత్త లుక్స్ ఆమెలోని కొత్త యాంగిల్ ను బయటకు తెస్తున్నాయి.

వెబ్ సీరీస్ లతో పాటు సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది హారిక. సరైన సినిమా ఛాన్స్ కోసం అమ్మడు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈలోగా వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. హీరోయిన్ అవ్వాలని ఉన్నా అందుకు తగిన అవకాశాలు రాక వెబ్ సీరీస్ లు చేస్తుంది హారిక. బిగ్ బాస్ తో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డా అమ్మడికి ఇంకా సినిమా ఛాన్సులు మాత్రం రావట్లేదు. అందుకే వారి దృష్టిలో పడాలనే ఈ హాట్ స్టిల్స్ తో అదరగొడుతుంది హారిక. ఇక మీదట అయినా హారికకు సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ఎలాగైనా సినిమా ఛాన్స్ పట్టేయాలని అమ్మడు టాలెంట్ చూపించేస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: