పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేసి ఈ సినిమాను తెలుగులో చేయగా అది భారీ హిట్ నమోదు చేసుకుంది. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం పక్కన పెడితే ఈ సినిమాలో ఓ మైనస్ పవర్ స్టార్ అభిమానులను ఎంతో కలిచివేసింది. 

అదే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ను పెట్టడం. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఉన్న పార్ట్ ఏ మాత్రం సూట్ కాలేదని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వాపోయారు. దాంతో ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది అనుకున్న ఫ్లాష్ బ్యాక్ మైనస్ గా మారింది. సరిగ్గా ఇదే తప్పును ఇప్పుడు పవన్ అన్న చిరంజీవి సినిమాలో కూడా చేయబోతున్నారని తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు చిరంజీవి. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు ఇప్పటికే ఇద్దరు దర్శకులు మారగా చివరికి మోహన్ రాజా ఎంపికయ్యాడు. అయితే మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అనేది లేదు కానీ చిరంజీవి మాస్ హీరో కావడంతో ఆయన అభిమానుల కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను దర్శకుడు మోహన్ రాజా సృష్టించాడట. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమాకు చేసిన తప్పే వీరు కూడా చేస్తున్నారని మెగా అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: