బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ విషయం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు పోర్నోగ్రఫీ కంటెంట్ క్రియేషన్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సంచలనాత్మక కేసులో ముంబై పోలీసులు పోర్న్ వీడియోలను తయారు చేసి మొబైల్ యాప్ ద్వారా ప్రసారం చేశారనే ఆరోపణలపై కుంద్రాను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రలే స్వయంగా ప్రకటించారు. "అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్‌ల ద్వారా స్ట్రీమింగ్ చేయడం గురించి క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్ కుంద్రాను అరెస్టు చేశాం. ఎందుకంటే అతనుఇందులో కీలక పాత్రధారుడిగా ఉన్నాడు. దీనికి సంబంధించి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది" అని నాగ్రేల్ చెప్పారు.

కుంద్రాపై ఫిబ్రవరిలో నమోదైన కేసు ఆధారంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి గత రాత్రి జరిగిన నాటకీయ పరిణామాల వరకు ఈ 46 ఏళ్ల బ్రిటిష్-భారతీయ వ్యాపారవేత్త క్రైమ్ బ్రాంచ్ సిఐడి స్కానర్ కింద ఉన్నారు. ఇక గత ఏడాది కాలంగా మాదకద్రవ్యాల కేసుతో సతమతమవుతున్న బాలీవుడ్‌ వర్గాలను కుంద్రా ఆకస్మిక అరెస్టు ఆశ్చర్యపరిచింది. ఈ కేసులో కొన్ని ఇంక్రిమినేటింగ్ మెటీరియల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. పోర్న్ రాకెట్‌లో బయటకు వచ్చిన కొంతమందిపై విచారణ కొనసాగిస్తున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా కుంద్రా భార్య శిల్పా శెట్టి ఎక్కడ ? అని అందరూ ఆలోచిస్తున్నారు. దాదాపు ఒక రాత్రి అంతా కుంద్రా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే శిల్పాశెట్టి ప్రస్తుతం తన సోదరి, తల్లితో కలిసి ముంబై, జుహూలో ఉన్న తమ బంగ్లాలో ఉన్నారని తెలిసింది. డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్సర్ 4'లో ప్రస్తుతం జడ్జిగా చేస్తున్న శిల్పా శెట్టి ఆమె భర్తను అరెస్టు చేసిన తరువాత ముంబైలో జరిగిన షో షూటింగ్ కు హాజరు కాలేదు. పోర్నోగ్రఫీ కేసులో ఈ వ్యాపారవేత్త జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉండాలని కోర్టు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: