ఎట్టకేలకు ధియేటర్లు తెరుచుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలను పక్కకు పెట్టి వచ్చే వారం జూలై 30న రెండు చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. అసలు కరోనా గురించి పూర్తిగా మర్చిపోయి. జనం ధియేటర్లకు వస్తారా రార అన్న విషయానికి సంబంధించి కొనసాగుతున్న చర్చలకు జూలై 30న ఒక జవాబు లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి.


ఈరెండు చిన్న సినిమాలకు కనీస స్పందన ప్రేక్షకుల నుండి వస్తే ఆతరువాత ధైర్యం చేసి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ నాని ‘టక్ జగదీష్’ విడుదల అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆతరువాత ఇక పెద్ద సినిమాలు అన్నీ క్యూ కట్టబోతున్నాయి. ప్రస్తుతం జనం ఓటీటీ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు.


దీనితో సినిమా ఎంతో బాగుంటే కాని ధియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సినిమాల మధ్య జరగబోతున్న పోటీ ఆశక్తిదాయకంగా మారింది. యువ హీరో తేజ సజ్జా నటించిన 'ఇష్క్' మూవీతో పాటు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘తిమ్మరుసు’ మూవీ పోటీగా రాబోతోంది. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈమూవీకి ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీలో లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించాడు.


ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ మంచి స్పందన రావడంతో ఈమూవీ హిట్ అవుతుందా అన్న అంచనాలు వస్తున్నాయి. తేజా సజ్జ నటించిన ‘ఇష్క్’ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనేది దీనికి ఉపశీర్షిక. ఇందులో తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జాంబిరెడ్డి’ సినిమాతో సక్సస్ అందుకున్న తేజ సజ్జ ‘ఇష్క్’ సినిమాతో మరో హిట్ అందుకుంటాడు అనే ఆశతో ఈమూవీ చేసాడు. ఈ రెండు సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఇండస్ట్రీలోని నిర్మాతల భవిష్యత్ ఎత్తుగడలు ఉంటాయి అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: