విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒక సినిమానే కాదు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు పునాది వేసిన సినిమా. అప్పటివరకు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం అనేదే తెలియదు మన హీరోలకు. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత వరుస మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ అయిందని కాబోలు అందరూ హీరోలలో ధైర్యం వచ్చి మల్టీ స్టారర్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకులను ముఖ్యం గా కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో నొప్పచింది.

2013 లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పండగ సమయంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రంలో వెంకటేష్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించగా, మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. ఇక ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్, జయసుధ, హిందీ నటి రోహిణి హట్టంగడి నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు రెగ్యులర్ గా మాట్లాడే యాస కాకుండా గోదావరి యాసలో డైలాగులు పలికారు. దీనికి విమర్శకులు సైతం మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు మంచి ఆదరణ అందించారు.

ఇక ఈ చిత్రం లో సమంత తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం జరిగింది. ఈ చిత్రం తర్వాత చాలా పాత్రలకు ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అప్పటివరకు గాయనీ చిన్మయి ఆమెకు డబ్బింగ్ చెప్పేది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో నిర్మించబడిన భారీ మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలై సంచలనాత్మక విజయం సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర దూకుడు గబ్బర్ సింగ్ సినిమాల తర్వాత అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈచిత్రం రికార్డులకెక్కింది. ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సహాయ నటుడు ప్రకాశ్ రాజ్, ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రత్యేక బహుమతిగా అంజలి నంది పురస్కారాలు 2013 సంవత్సరానికి గానూ అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: