మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ త‌న బ్ర‌ద‌ర్ బ‌న్ని లాగా హీరో అవుదామ‌ని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగా నటించాడు. తన సోదరుడు అల్లు అర్జున్ నటన, రాం చరణ్ నటన ప్రభావంతో తెలుగు నిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. ఆయనకు అనేక పెద్ద బ్యానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది. కానీ వాటిని తిరస్కరించాడు. ఎందుకంటే అపుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమే కార‌ణం. కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించడానికి ఛాలెంజ్ గా తీసుకున్నాడు.

 

    అయితే అల్లు శిరీష్ మ‌న‌కు సినిమాలో మాత్ర‌మే న‌టిస్తాడ‌ని తెలుసు. కానీ గీతా సంస్థ కో ప్రొడ్యూస‌ర్‌గా, సౌత్ స్కోప్ మాస ప‌త్రిక ఎడిట‌ర్‌గా కూడా ఈయ‌న ప‌ని చేస్తున్నాడు. కె.రాధామోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టి సినిమా `గౌరవం`తో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు అల్లు శిరీష్‌. ఆ త‌రువాత 2014లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మాత‌క‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కొత్త జంట‌లో న‌ట‌న‌కు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శిరీష్ జోడీగా రెజీనా న‌టించింది.



జే.బి ఈ సినిమాకి సంగీతం అందించ‌గా పాట‌లు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంది.   అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా ద్వారా 2016 లో మ‌ళ్లీ తెర మీద క‌నిపించాడు. ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిచింది. ఈ సినిమాలోని శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ స‌నిమా త‌రువాత అల్లు శిరీష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా తీయ‌లేదు.


   అయితే గ‌తంలో అల్లు శిరీష్, హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్‌తో ప్రేమాయ‌ణం నడుపుతున్న‌ట్టు కూడా ప్ర‌చారం సాగింది. వారి ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ క‌థ‌నాలు కూడా గ‌తంలో వెలువ‌డ్డాయి. దానికి కార‌ణం అనూ ఎమ్మాన్యుయేల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అల్లు శిరీష్ ఓ విడియోను సోస్ట్ చేయ‌డమే.. అయితే మెగా కాంపౌండ్‌లో ప‌లు సినిమాలు చేసింది అను. శిరీష్ చిన్న మామ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అజ్ఞ‌తవాసి చిత్రంలో న‌టించింది. ఆ త‌రువాత నా పేరు సూర్య లో అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించింది ఈ ముద్దు గుమ్మ. దీంతో అల్లు శిరీష్, అను ఎమ్మానుయేల్ మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: