టాలీవుడ్ లో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతున్న నీరజ కోన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లోతెరకెక్కే సినిమాలకు టాప్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన తండ్రి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. తాజాగా ఆమె తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో తండ్రితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా నెటిజనులు ఏపీ స్పీకర్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నీరజకు ఈ రేంజ్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా గట్టిగానే సపోర్టు ఉంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ స్వయానా నీరజకు అన్న. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత నీరజకు క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తరచుగా  కలుసుకుంటూ ఉంటారు.

నీరజ అసిస్టెంట్ స్టైలిస్ట్ గా ఎన్టీఆర్ నటించిన "బాద్ షా" చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నితిన్ "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంతో స్టైలిస్ట్ గా మారింది. అనంతరం వరుసగా నితిన్ సినిమాలు "కొరియర్ బాయ్ కళ్యాణ్, హార్ట్ ఎటాక్" చిత్రాలకు స్టైలిస్ట్ గా పని చేసింది. తరువాత నీరజ అక్కినేని కోడలు సమంతను కలుసుకుని ఆమె పర్సనల్ స్టైలిస్ట్ గా సెటిల్ అయింది. నీరజ "అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య" వంటి సమంత చిత్రాలకు స్టైలిస్ట్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గానూ పని చేసింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, వివి వినాయక్ వంటి దర్శకులు తోనూ కలిసి పని చేసింది. అంటే నీరజ కోన మంచి పొలిటికల్, సినిమా బ్యాక్గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అన్నమాట. కానీ ఈ ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియదు.




మరింత సమాచారం తెలుసుకోండి: