కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు రిఓపెన్ కావడంతో వరుస సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. గత వారం "తిమ్మరుసు", "ఇష్క్" బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. ఈ శుక్రవారం అంటే ఈరోజు అయితే ఏకంగా 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక్క మూవీకి కూడా పెద్దగా బజ్ లేదు. అందులో ప్రేక్షకులకు తెలిసిందల్లా ఒక్క "ఎస్ఆర్ కళ్యాణమండపం" మాత్రమే. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. శ్రీధర్ గాదె తెరకెక్కిన ఈ సినిమా 148 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తండ్రీకొడుకుల మధ్య బంధానికి సంబంధించిన ఎమోషనల్ డ్రామా. ఈ ఫ్యామిలీ డ్రామాకు యూత్ కూడా కనెక్ట్ కావడానికి లవ్ అనే యాంగిల్ ను ఇచ్చాడు దర్శకుడు. అంతేకాదు కళ్యాణమండానికి హీరోతో, హీరోయిన్ తో మెలిపెట్టారు.

ఇక ఈ సినిమాను చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొత్తం రొటీన్ రోతకొట్టుడు అని పెదవి విరుస్తున్నారు. మద్యానికి బానిసై తండ్రి వారసత్వంగా ఇచ్చిన కళ్యాణమండపాన్ని సక్సెస్ ఫుల్ గా నడపలేకపోయిన వ్యక్తి ధర్మ (సాయి కుమార్). అది పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉండడంతో దాన్ని గౌరవంగా భావించిన ధర్మ కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) కళ్యాణమండపాన్ని నిలబెట్టే బాధ్యతను భుజానికెత్తుకుంటాడు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె ఎవరో కాదు విలన్ కూతురు. సినిమాకు సిద్ శ్రీరామ్ పాడిన అద్భుతమైన పాటలు సహాయం చేయలేకపోయాయని అంటున్నారు. అంతేకాదు సినిమా మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించారని విమర్శిస్తున్నారు. ట్రైలర్ తో ఆడియన్స్ ను మోసం చేశారని వాపోతున్నారు. మరోవైపు చాలా సెంటర్లలో నూన్ షోకు, కొన్ని సెంటర్లలో మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్ అయ్యాయని అంటున్నారు. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే వారాంతం కాబట్టి ప్రేక్షకులతో పాటు వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: