మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హిట్ , సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అయితే  మెగాస్టార్ చిరంజీవి సాధించిన కొన్ని ఇండస్ట్రీ హిట్స్ గురించి  మనం మాట్లాడుకుందాం.

పసివాడి ప్రాణం : చిరంజీవి , విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1987 లో విడుదలైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. చక్రవర్తి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి నెంబర్ వన్ గా నిలిచింది.

యముడికి మొగుడు: 1987 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా విజయశాంతి నటించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించింది.

జగదేకవీరుడు అతిలోకసుందరి: 1990 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా శ్రీదేవి నటించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్ర చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

గ్యాంగ్ లీడర్: 1991 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్ గా నటించింది. విజయ బాపినీడు దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాత. బప్పి లహరి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించింది.

ఘరానా మొగుడు: 1992లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి తరపున నగ్మా , వాణి విశ్వనాథ్ హీరోయిన్ లుగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి వరప్రసాద్ నిర్మాత. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో చిరంజీవి సరికొత్త రికార్డులను తెలుగు ఇండస్ట్రీలో సృష్టించాడు.

ఇంద్ర: 2002 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది.

 ఇలా చిరంజీవి ఈ సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: