రాబోయే 2022 సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ బెర్త్ లు కన్ఫర్మ్ చేయగా మరికొన్ని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి సిద్దమవుతున్నట్లుగా కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక రిలీజ్ కన్ఫర్మ్ అయిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3, అలానే ఇలయతలపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలు కూడా ఆ రేస్ లో నిలిచే ఛాన్స్ ఉందని టాక్.
ఇక వీటిన్నిటికీ చెక్ పెడుతూ కొద్దిసేపటి క్రితం నుండి పలు ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం రాబోయే సంక్రాంతికి వీటన్నిటినీ వెనక్కి నెట్టి రాజమౌళి భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రానుందని సమాచారం. ఇప్పటికే సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాల దర్శకులతో కొంత సంప్రదింపులు జరిపిన ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య, దర్శకడు రాజమౌళి ఆ రెండు సినిమాల నిర్మాతలని ఒప్పించారని, అలానే రేపు రాధేశ్యామ్ నిర్మాతలని కూడా కలిసి మాట్లాడిన అనంతరం తమ సినిమాపై ఫైనల్ గా ఒక నిర్ణయానికి రానున్నారని అంటున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనుక సంక్రాంతికి కన్ఫర్మ్ అయితే ఎఫ్ 3, బీస్ట్ సినిమాలు కూడా ఆ రేస్ నుండి తప్పకునే ఛాన్స్ ఉందట.
నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్, అప్పటికి ఇంకా సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో మరొక డేట్ కోసం వెతుకుతున్నారని, అయితే ఒకవేళ వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తే అది మరింతగా ఆలస్యం అవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా ఆలోచన చేసి సంక్రాంతికి సిద్దమవుతున్న సినిమాల దర్శకనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. కాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ చర్చలు ఆల్మోస్ట్ సఫలం అయితే మహేష్, పవన్, ప్రభాస్ సినిమాలు మూడు కూడా మార్చికి వాయిదా పడడం ఖాయం అంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ నిజంగానే సంక్రాంతి కి వస్తుందా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే రిలీజ్ కి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: