టాలీవుడ్ లో మంచి లవ్ స్టోరీ అనగానే చాలామందికి గుర్తొచ్చే చిత్రం "ప్రేమమ్". ఈ సినిమాలోని పాటలకు, అలాగే స్టోరీకి యూత్ దాదాపుగా అడిక్ట్ అయిపోయారనే చెప్పొచ్చు. యూత్ ను అంతగా ఆకట్టుకోవడానికి ఈ సినిమాలో స్పెషల్ ఏముంది ? రొటీన్ లవ్ స్టోరీనే కదా అంటే... నిజ జీవితానికి దగ్గరగా ఇంకా చెప్పాలంటే అందులో యుక్త వయసు నుంచి చూపించే సన్నివేశాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ చోటు చేసుకుంటాయి. అలా సినిమా కథ ప్రేక్షకులకు సొంతమైంది. నా సొంత కథ అనే ఫీలింగ్ లోనే ఉంటాడు ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు.

సినిమా మలయాళ చిత్రం చిత్రం "ప్రేమమ్"కు రీమేక్ గా రూపొందింది. మలయాళంలో 2015లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అదే చిత్రాన్ని అదే టైటిల్ తో ఇక్కడ రూపొందించారు. ఎక్కడా రీమేక్ అనే ఫీలింగ్ రాదు. అలాగే ఎక్కడ సోల్ కూడా మిస్ అవ్వదు. దర్శకుడు మలయాళ కథతోనే మలయాళ వాసనలు లేకుండా తెలుగు తెరపై తన ప్రతిభతో మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. ఇలాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, అది కూడా రీమేక్ అంటే మాములు విషయం కాదు. కత్తి మీద సాము వంటిదే.

ఈ చిత్రంలో నాగ చైతన్య టీనేజ్ నుంచి యుక్త వయసు వరకు మూడు దశల్లో కన్పిస్తాడు. ఆ మూడు దశల్లోనూ ముగ్గురు హీరోయిన్లను లవ్ చేస్తాడు. కానీ ఎట్టకేలకు చిన్నప్పుడు తెలిసిన ఒక అమ్మాయే ఆయన జీవితంలోకి వస్తుంది. శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అనుపమ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున, వెంకటేష్ అతిథి పాత్రల్లో మెరిశారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన "ప్రేమమ్" 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి. నాగ చైతన్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లో మైలురాయి. సౌండ్‌ట్రాక్‌ను రాజేష్ మురుగేశన్ అందించగా, గోపి సుందర్ స్వరపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: