స్టార్ నటి సమంత ఇటీవల జాను మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. అంతకముందు తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన 96 మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన అయి సినిమాన దిల్ రాజు నిర్మించారు. ఆ తరువాత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో రాజి అనే పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకున్న సమంత, ప్రస్తుతం చేస్తున్న సినిమా శాకుంతలం.
గుణశేఖర్ దర్శకత్వంలో గుణా టీమ్ వర్క్స్, అలానే దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై ఎంతో భారీ ఎత్తున నిర్మితం అవుతున్న ఈ మైథలాజికల్ సినిమాలో సమంత, శకుంతల గా నటిస్తుండగా దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దానితో పాటు కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమా కూడా చేస్తున్నారు సమంత. ఇక త్వరలో ఆమె నటించనున్న మరొక రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
అయితే మ్యాటర్ లోకి వెళితే తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే సమంత తన ఫోటోలు, ఇతర విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇక నేడు ఆమె ఎంతో స్టైలిష్ గా లేటెస్ట్ ట్రెండీ స్టైల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేసారు. తన అంద చందాలు ప్రదర్శిస్తూ పలు డిఫరెంట్ ఫోజుల్లో సమంత దిగిన ఆ ఫోటోషూట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన పలువురు ఫ్యాన్స్, బాబోయ్ సమంత ఏంటి నువ్వేనా అంటూ సరదాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: