మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో యాక్షన్ ఎంటర్ టైనర్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఇలా చాలా సినిమాలు ఉన్నా కొన్ని మాత్రం ఇప్పటికీ ప్రజల మనసుల్లో అలాగే ఉండిపోయాయి. అలాంటి సినిమాల్లో ఒకటే "లెజెండ్". ఈ సినిమా 2014 లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి తెలియని కొన్ని విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. "లెజెండ్" లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి అలరించాడు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను ఈ సినిమాతో రెండవ సారి బాలయ్యతో జత కట్టాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో "సింహ" వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే.

ఈ సినిమాతో మొదటి సారిగా హీరో జగపతిబాబు విలన్ రోల్ లో కనిపించి అధ్బుతంగా నటించాడు. ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ బాలకృష్ణ  సినిమాకు మొదటిసారి సంగీతాన్ని అందించగా, బోయపాటితో ఇది మూడవసారి కావటం విశేషం. ఇంతకు ముందు బోయపాటి మరియు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో భద్ర మరియు తులసి సినిమాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో  మొత్తం 700 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయగా, ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో ప్రదర్శితం అయింది. లెజెండ్ మూవీ 31 కేంద్రాలలో 100 రోజుల విజయోత్సవం పూర్తి చేసుకుంది. అదే విధంగా 2 కేంద్రాలలో 275 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది.

మొత్తం బాలకృష్ణ సినిమా కెరియర్ లో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు 200 రోజుల రికార్డును దక్కించుకున్నాయి. ఇప్పుడు ఐదవ సినిమాగా ఆ లిస్ట్ లో లెజెండ్ కూడా చేరింది.  వాటిలో ముద్దుల మావయ్య, సమరసింహరెడ్డి, నరసింహ నాయుడు మరియు సింహా సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా కేవలం ఒక్క థియేటర్ కడప జిల్లా ప్రొద్దుటూరు లో 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఉత్తమ కథానాయకుడిగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డును బాలకృష్ణ గెలుచుకున్నాడు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్ సంతోషం అవార్డును గెలుచుకున్నాడు. మిగిలిన కొన్ని విభాగాలలో సైతం అవార్డులు దక్కించుకుంది లెజెండ్ మూవీ. ఈ సినిమాను 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా టోటల్ రన్ లో 110 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏమిటో చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: