ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొంతమంది ఆఖరికి మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం చేస్తున్నారు. నటుల దగ్గరనుంచి సినిమాటోగ్రాఫర్ కొరియోగ్రాఫర్లు ఫైట్ మాస్టర్లు హీరోయిన్లు ఆఖరికి నిర్మాతలు కూడా దర్శకత్వం వహించి దర్శకత్వం యొక్క విలువను చాటి చెబుతున్నారు. అయితే వీరిలో అందరూ కాకుండా కొంతమంది మాత్రమే దర్శకులు గా సక్సెస్ అయ్యి దర్శకత్వంలోనూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆవిధంగా నటుడి గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు హీరో రాహుల్ రవీంద్రన్.

చిన్మయి భర్తగా కొన్ని సినిమాలలో హీరోగా నటుడి గా రాహుల్ రవీంద్రన్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అయితే ఆయన సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమాను ఫీల్ గుడ్ గా తెరకెక్కించి ఫీల్ గుడ్ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత అక్కినేని నాగార్జున తో మన్మధుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను భారీగా నిరాశపరిచిన విషయం తెలిసిందే ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా రాహుల్ రవీంద్రన్ అటు అక్కినేని నాగార్జున లకు పెద్ద ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. 

ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరి రాహుల్ రవీంద్రన్ ఇటీవలే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కథను తయారు చేశాడు. దాన్ని తొందరగా సినిమా గా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. దీనికి రష్మిక మందన ను హీరోయిన్ గా నటింప చేయాలని ఆయన సిద్ధమవుతుండగా ఆమె కూడా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో ప్రెస్మిత అభిమానులు ఈ యాక్టర్ డైరెక్షన్ మానేసి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆయన గత సినిమా మన్మధుడు 2 భారీ ఫ్లాప్ కావడంతో ఎక్కడ రష్మిక మందన కు ఫ్లాప్ ఇస్తాడేమో అన్న భయంతో వారు ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: