డార్లింగ్.. ఛత్రపతి.. బాహుబలి.. అని ఎవరు పిలిచినా పలికే వ్యక్తి ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టి.. తొలి సినిమాతో విజయం సాధించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత 2003లో రిలీజ్ అయిన రాఘవేంద్ర ఫ్లాప్ కావడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు ప్రభాస్. అడవి రాముడు, చక్రం సినిమాలు ప్రభాస్ కు మంచి పేరే తీసుకొచ్చాయి. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక 2005వ సంవత్సరంలో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి ప్రభాస్ కెరియర్ నే మార్చేసింది.  ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, యోగి సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇలియానాతో నటించిన మున్నా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2008వ సంవత్సరంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన.. బుజ్జిగాడు మంచి విజయం అందుకుంది.
 
మరోవైపు 2009లో వచ్చిన బిల్లా చిత్రం.. పర్వాలేదనిపించింది.  పూరీగన్నాధ్ డైరెక్షన్ లో వెండితెరకెక్కిన ఏక్ నిరంజన్ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. 2010లో కరుణాకరన్ డైరెక్షన్ లో కాజల్ అగర్వాల్ తో నటించిన డార్లింగ్ క్లాస్ హీరో కోణాన్ని చూపించింది. ఊహించిన స్థాయిలోనే విజయాన్ని అందుకుంది. 2011లో విడుదలైన మిస్టర్ పర్‌ఫెక్ట్.. డార్లింగ్ ని మించి హిట్ కొట్టింది.

2013లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మిర్చి ప్రభాస్ కు మంచి పేరు తీసుకొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరెక్కిన బాహుబలి చిత్రం ప్రభాస్ ను పాన్ ఇండియన్ స్టార్ గా మార్చేసింది. అంతేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. వెయ్యి కోట్లు వసూళ్లు చేయగలిగింది. ప్రపంచ స్థాయిలో 2వేల కోట్లు సాధించింది. 2019లో వచ్చిన సాహో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది రాథేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. 2022వ సంవత్సరంలో సలార్, ఆదిపురుషు చిత్రాలకు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: