టాలీవుడ్ లో దర్శకులు వివిధ కోణాల్లో చిత్రాలు తెరకెక్కించి  ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా చాలా వరకు హిట్స్ ను అందుకుంటాయి. వాటిలో ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలు కూడా మెజారిటీ ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రాలని చెప్పొచ్చు. మొదట్లో పౌరాణిక, జానపద వంటి చిత్రాలకు పరిమితమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరవాత పలు రకాల కథనాలతో కొత్తదనాన్ని కనబరిచింది. వీటిలో ఫ్యాక్షన్ డ్రాప్ కూడా ఒకటి. ఇక టాలీవుడ్ లో ఇప్పటికీ కొన్ని వందల చిత్రాలు ఫ్యాక్షనిజం కాన్సెప్ట్ లతో రూపుదిద్దు కోగా ఎన్నో చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. కొన్ని చిత్రాలు మాత్రం టాలీవుడ్ చరిత్రలో ధృవ తారల్లా నిలిచిపోయాయి. అలాంటి చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న కొన్ని ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలను ఇపుడు చూద్దాం.

సమరసింహ రెడ్డి

బాలకృష్ణ ,అంజలి జవేరి, సిమ్రాన్ లు హీరో హీరోయిన్లుగా బి గోపాల్ డైరెక్షన్ లో ఫ్యాక్షనిజం మెయిన్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. బాలయ్య యాక్షన్ డైలాగ్స్, కాన్సెప్ట్ సినిమాకు మంచి పవర్ ను అందించి  సక్సెస్ లో భాగమయ్యాయి. జయ ప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావుల నటన ఈ సినిమాకి మరింత ప్లస్ గా నిలిచింది. 1999 జనవరి 13 న సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం కలెక్షన్ కింగ్ గా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 22 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎన్నో రికార్డులను తిరగరాసింది.
ఇంద్ర


ఆ తర్వాత 2002 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ కూడా ఇదే తరహాలో బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసింది. ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంద్రసేనా రెడ్డిగా చిరు తన పవర్ కి స్టైల్ ను జోడించి డైలాగ్స్ తో ఆడియన్స్ తో విజిల్ వేయించాడు. "మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా" అన్న చిరు పవర్ఫుల్ డైలాగ్ పిల్లలు నోళ్లలో కూడా మారుమ్రోగింది అంటే ఈ సినిమా జనాల్లోకి ఏ రేంజ్ లో దూసుకుపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ డైలాగ్ ను ప్రజలు వాడుతూనే ఉన్నారు. ఈ చిత్రంలో చిరు ప్రతి డైలాగ్ నాటు బాంబులా పేలింది. సినిమాలోని పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. పాటల్లో చిరు డ్యాన్స్ మరో ఎత్తు. "దాయి దాయిదామ్మా" అప్పట్లో ఎంత హైలెట్ ఆయిందో తెలిసిందే.  పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 45 కోట్లకు పైగా వసూళ్లు వర్షం కురిపించి సునామీ సృష్టించింది.
* బాలకృష్ణ ప్రధానపాత్రలో వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రం చెన్నకేశవరెడ్డి. ఇది కలెక్షన్ ల పరంగా ఆకట్టుకోకపోయిన మాస్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 * నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఫ్యాక్షన్ డ్రాప్ మూవీ ఆది. ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. అంత చిన్న వయసులోనే రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్.
 * తెలుగు సినిమా చరిత్రలో వెంకటేష్ ఒక ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంటువంటి హీరోను సైతం డైరెక్టర్ ఎన్ శంకర్ ఫ్యాక్షన్ హీరోగా చూపించాడు.  అలా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం "జయం మనదేరా". ఈ సినిమాలో ద్విపాత్రాభినయంతో వెంకటేష్ ఆకట్టుకున్నాడు.
 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చి విజయాలు సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: