సాధారణంగా ఏ సినీఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో మంచి విజయం సాధించారు అంటే.. ఆ కథను మరో ఇండస్ట్రీ వాళ్ళు రీమేక్ హక్కులను కొనుగోలు చేసి మరి , వారి భాషలలో రీమేక్ చేసుకుంటూ ఉంటారు. అలా తమిళం నుంచి తెలుగు కు ,తెలుగు నుంచి కన్నడకు, కన్నడ నుంచి హిందీకి ఇలా మంచి కథలు వచ్చినప్పుడు తప్పకుండా రీమేక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే కన్నడ పవర్ స్టార్ గా రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.. అయితే ఈయన కూడా తెలుగు హీరోలకు బాగా సుపరిచితుడు.. ఇక తెలుగులో మంచి విజయాన్ని సాధించిన కొన్ని సినిమాలను కూడా హీరోగా కన్నడలో చిత్రీకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఇకపోతే పునీత్ రాజ్ తెలుగు సినిమా ల నుంచి కన్నడ లోకి రీమేక్ చేసిన బెస్ట్ ఫైవ్ మూవీస్ ని మనం తెలుసుకుందాం.

1. ఇడియట్ - అప్పు :
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్  హీరోగా అప్పు అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది.ఈ సినిమా ముందుగా  తెలుగులో విడుదల చేయాలనుకున్నాడు పూరి జగన్నాథ్.. కానీ పునీత్ తండ్రి ముందుగా కన్నడ లోనే విడుదల చేయాలని పట్టుబట్టడంతో ఈ సినిమాను కన్నడలో తెరకెక్కించడం జరిగింది.. తర్వాత తెలుగులో రవితేజతో ఇడియట్ పేరుతో రీమేక్ అయింది.. రెండు సినీ ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమా మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

2. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:
ఈ సినిమాని కూడా పునీత్ కన్నడలో మౌర్య అనే పేరుతో రీమేక్ చేసి, అక్కడ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

3. రెడీ:
చాక్లెట్ బాయ్ రామ్ హీరోగా , జెనీలియా హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాని , పునీత్ కన్నడ లో రామ్ అనే పేరుతో రీమేక్ చేసి , అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

4. ఒక్కడు:
మహేష్ బాబు , భూమిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పునీత్ కన్నడలో  అజయ్  అనే పేరుతో రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.

5. దూకుడు:
సినిమా కన్నడ లో పవర్ అనే పేరుతో రీమేక్ అయ్యి అత్యంత ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: