చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఇలా సినిమాల్లో చాలా మంది ప్రేక్షకులు కేవలం  హీరో హీరోయిన్లను మాత్రమే చూస్తూ ఉంటారు. ఇంకొంత మంది ప్రేక్షకులు విలన్ల పర్ఫామెన్స్ కి ఫిదా అవుతూ ఉంటారు. కానీ అందరూ ప్రేక్షకులు సినిమాలోని  చిన్న పాత్రలకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు. ఆ చిన్న పాత్రలో చైల్డ్ ఆర్టిస్టులు చేసే నటన ఎంతోమందిని ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ అలా చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులందరికీ అలరించి  ఇప్పటికి కూడా అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు తేజ సజ్జ.


 ఒకప్పుడు చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో ఒక చిన్న పాత్ర తెలుగు ప్రేక్షకులు అందరికి కూడా గుర్తుండి పోయింది అని చెప్పాలి. ఆ పాత్ర ఎవరిదో కాదు తేజ సజ్జ.. ఒకప్పుడు బుల్లి చిరంజీవిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు తేజ సజ్జ. ఎందుకంటే ఇంద్ర సినిమాలో  చిన్నప్పుడు చిరంజీవి పాత్రలో నటించాడు. అంతేకాదు ఇక చిన్న వయసులోనే సీమ పౌరుషాన్ని తన నటనలో చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు తేజా. ఇలా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.


 ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో యువ హీరోగా మారిపోయాడు తేజ సజ్జ. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత జాంబి రెడ్డి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఒకప్పటి ఈ బుల్లితెర చిరంజీవి. ఇలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా ఇప్పుడు హీరోగా కూడా ఆకట్టుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: