వెండి తెరపై కొన్ని పాత్రలు పోషించాలంటే చాలా గట్స్ ఉండాలి.అందులో సులువుగా పోషించేది అమ్మ పాత్ర అయితే..మరి కష్టంగా ఉండేది అత్త పాత్ర.ఇక అమ్మ లాగా సాఫ్ట్ గా ఉంటే అత్త పాత్ర పండదు.అత్త పాత్ర అంటే కాసింత గౌరవం,కాస్త హుందాతనం,గంభీరంగా ఉండాలి.అయితే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చి,ఆతర్వాత ఆంటీలు గా మారిపోయిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం.


1). హేమ:


హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకున వారిలో హేమ కూడా ఒకరు.చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. నటి హేమకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ రఘు మాస్టర్ సహాయంతో ఆమె హీరోయిన్లకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అవకాశాలు వెలువడ్డాయి.దాంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండిపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

2). సుధా:

హీరోయిన్ గా సుధా కూడా ఎంట్రీ ఇద్దామని అనుకున్న దట.మొదటగా డైరెక్టర్ బాలచంద్రతో కలసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో..ఇక డైరెక్టర్ బాలచంద్ర వచ్చి హీరోయిన్ గా నువ్వు సక్సెస్ కాలేకపోతున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగించు అని చెప్పడంతో..ఆమె అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోందట.ఇప్పటి వరకు ఈమె 700 పైగా సినిమాలలో నటించినట్లు సమాచారం.

3).సిల్క్ స్మిత:

హీరోయిన్ గా అవుదామని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈమే.కానీ చివరికి ఐటెం గర్ల్ గా మారిపోయింది.మొదటిసారిగా ఈమె మేకప్ ఉమెన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తమిళంలో బోర్ గర్ల్ పాత్ర రావడంతో.. విజయలక్ష్మి కాస్తా సిల్క్ స్మితగా మారిపోయింది.

4). సనా:

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన నటి సనా గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగులో పాటు ఇతర భాషల సైతం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా ముందుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న కానీ అది సక్సెస్ పోయింది దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.

5). పవిత్ర లోకేష్:

హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకుని వారిలో పవిత్ర లోకేష్ కూడా ఒకరు. 1994 సంవత్సరంలో నటుడు అంబరీష్ సలహాతో పవిత్ర సినిమాలో నటించింది. కానీ సక్సెస్ కాలేక పోయింది.ఇక తెలుగులో ప్రస్థానం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తోంది.

6). సురేఖ వాణి:

నటనపై మక్కువ తో హైదరాబాదుకు వచ్చింది నటి సురేఖవాణి. ఇక ఈమె కూడా హీరోయిన్ గా సెటిల్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చింది. కానీ యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయింది.

7). అపూర్వ:

హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామని మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అపూర్వ. వయసు తక్కువ ఉన్నప్పటికీ..చూడడానికి ఆంటీలా ఉండడంతో ఈమెకు అవకాశాలు రాలేదు.ఇక దాంతో క్యారెక్టర్ గా  రాణిస్తోంది.

ఇక వీరే కాకుండా మరికొంత మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: