ట్రెండ్ మారుతున్న కొద్దీ ప్రేక్షకులు తాము వీక్షించే సినిమాలలో కొత్త అనుభవాలను పొందాలని చూస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి దర్శకులు ఇతర రాష్ట్రాల నుంచి అలాగే దేశాల నుంచి కూడా హీరోయిన్ల ను తీసుకొచ్చి వారికి భారీగా పారితోషికం ఇచ్చి మరి, ఆ సినిమాలో ఐటమ్ సాంగ్స్ రూపం లో పెడుతూ ఉన్నారు.. గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా విడుదలైన సరే అందులో తప్పకుండా ఒక ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే.. ఐటెం సాంగ్ లేని సినిమా చాలా బోర్ అంటూ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.


అలా ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రముఖ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. మలైకా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో రాత్రి అయినా నాకు ఓకే.. పగలైతే డబుల్ ఓకే అంటూ మహేష్ బాబు తో స్టెప్పులేసి కుర్రకారుకు తన అందచందాలతో నిద్రలేకుండా చేసింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకు స్టెప్పులేసి ఇప్పటికీ ట్రెండింగ్ అవుతోంది అంటే అందుకు కారణం పాట మాత్రమే కాదు ఈ పాటకు స్టెప్పులేసిన మలైకా కూడా అందరికీ ఫేవరేట్ అయిపోయింది.


1973 వ ఈ సంవత్సరం అక్టోబర్ 23 వ తేదీన మహారాష్ట్ర లోని ధానేలో జన్మించింది. వీడియో జాకీ, యాంకర్, మోడల్ గా అనేక ప్రకటనల్లో ఈమె నటించింది. ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. మలైకా తన జీవితాన్ని హిందీ సినిమా అయినా దిల్ సే ద్వారా మొదలు పెట్టి, ఆ తరువాత కేవలం అతికొద్ది సమయంలోనే ఎంతో మంది ప్రేక్షకులను తన వశం చేసుకుంది. 2000 సంవత్సరం వచ్చేసరికి అతి చిన్న వయసులోనే ఈమె ఐటమ్ సాంగ్స్  తో స్టెప్పులేసి ఎంతోమంది కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: