రాజీవ్ కనకాల.... తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తడ్రి సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కొడుకు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.పలు సినిమాల్లో నటిస్తూ  ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు గుర్తింపు తెచుకున్నారు.ఇక యాంకర్ సుమ ని రాజీవ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.సుమ నెబ్బర్ వాన్ యాంకర్ గా బుల్లితెరపై ఏ విధంగా కొనసాగుతునదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందరికి తెలిసిన విషయం ఏమిటంటే రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ మధ్య అనుబంధం గురించి.ప్రతి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల ఏదో ఒక పాత్ర కనిపిస్తారు.

కనుకే వీరి ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే అందులో రాజీవ్ కనకాల తప్పకుండా ఒక పాత్ర సృష్టింస్తారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల కనిపించకపోవడంతో వీరి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని కొన్ని రూమర్స్ వస్తున్నాయి.ఈ విషయంపై కనకాల స్పందిస్తూ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు ఇప్పుడు సినిమాలలో నా కోసం కథనే మార్చి రాయాల్సి వస్తుందని నేను సినిమాలో నటించడం లేదు తప్ప మా మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. ఇక ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు కనిపించిన రాజీవ్ కనకాల ఒక విషయంపై ఇలా వెల్లడించారు.

 ఒక షూటింగ్ సమయంలో లో నేను ఎన్టీఆర్ ఆర్ చంద్ర పోయే వాళ్ళని దేవుని దయవల్ల బ్రతికి బయటపడ్డామని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీఆర్ తీసిన నాగ సినిమాలోని రైలు పైన యాక్షన్ సన్నివేశం షూటింగ్ చేస్తుండగా హఠాత్తుగా రైలు కదిలిందని అక్కడ చనిపోయే వాళ్ళం బ్రతికి బయటపడ్డ కనకాల తెలిపారు. ఆ రైలు అలా కదిలే సమయంలో పక్కన ఒక ఇనప రాడ్డు ఉండడం వలన దాని పట్టుకొని బయటకి వచ్చాము చెప్పారు. లేదంటే ఆ రోజే మేమిద్దరం చనిపోయే వాళ్ళం అని అంటూ రాజీవ్ కనకాల నాగ సినిమాలోని షూటింగ్ లో జరిగిన విషయాలను తెలియ జేశారు...?!!

మరింత సమాచారం తెలుసుకోండి: