ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిసార్లు దర్శక నిర్మాతలు తెరకెక్కించే  సినిమాలో ఫ్లాష్ బ్యాక్  కూడా ఎంతో కీలకం గా మారిపోతూ ఉంటుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ కీలకంగా  ఉన్న సినిమాలను తెరకెక్కించడం అంటే అటు దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్తో కూడుకున్న పని. ఎందుకంటే సినిమాను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లి ప్రేక్షకులకు అసలు కథ అర్థమయ్యేలా  చేయాలి అంటే ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్  ని అర్థమయ్యేలా తెరకెక్కించడంలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజన్లో పడిపోతారు.


 చివరికి సినిమా ఎటూ కాకుండా పోతుంది. అయితే ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా కూడా ఒకటి. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా మొదలు కాగానే ఇంద్రసేనారెడ్డి గా ఉన్న చిరంజీవి సీమలోని తగాదాలతో తండ్రిని కోల్పోతాడు.


 ఇక సీమను కాపాడడానికి తన అన్నదమ్ములలో ఎవరూ ముందుకు రాకపోవడంతో బాల్యంలోనే నేనున్నాను అని అందరికీ భరోసా ఇచ్చి ఇక తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు. కట్ చేస్తే కాశీలో టాక్సీ డ్రైవర్ శంకర్నారాయణ గా కనిపిస్తాడు చిరంజీవి. ఇలా కథ సాగిపోతూ ఉంటుంది. ఒక సాదాసీదా టాక్సీ డ్రైవర్ గానే దాదాపుగా ఇంటర్వెల్ వరకు ఈ కథ కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఇలా టాక్సీ డ్రైవర్గా చిరంజీవి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇంటర్వెల్ సమయంలో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. టాక్సీ డ్రైవర్గా శంకర్ నారాయణ పేరుతో ఉన్నది ఒక సాదాసీదా మనిషి కాదు ఏకంగా సీమ ప్రజలు అందరికీ కూడా దేవుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డి అనే విషయాన్ని చిరంజీవి నమ్మిన బంటుగా ఉన్న తనికెళ్ల భరణి నోరు విప్పుతాడు.



 ఇక ఇక అప్పుడే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అంతలో తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు. ఇక చిన్నప్పుడు తండ్రి స్థానాన్ని భర్తీ చేసిన  చిరంజీవి పెరిగి పెద్దయిన తర్వాత ఎలా తన శత్రువులను గడగడలాడించాడు సీమ ప్రజలందరినీ కాపాడటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు రక్తపాతాన్ని ఆపడానికి చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేశాడు అన్న విషయాన్ని ఇక ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఇక ఇంద్రసేనారెడ్డి గా చిరంజీవి నటన అదిరిపోతుంది అనే చెప్పాలి. అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించింది. ఇలా  బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినా చిరంజీవి ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కథకి ప్రాణం పోసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: