మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన 'అల వైకుంఠ పురంలో' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా ఏకంగా నాన్ బాహుబలి కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన రికార్డులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన తమన్ తన కెరీర్లోనే బెస్ట్ ఆల్బం ఇచ్చాడు. కేవలం తన కెరీర్ లోనే కాదు గత పదేళ్లలో ఈ సినిమా పాటలకు వచ్చినంత రెస్పాన్స్ మరే సినిమా పాటలకి రాలేదు.

 ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలోని 'సామజ వర గమన', 'రాములో రాముల', 'బుట్ట బొమ్మ' వంటి పాటలు ఫుల్ పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా 'బుట్ట బొమ్మ' సాంగ్ ఐతే ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసింది. ఈ పాట విడుదలైన మొదట్లో కాస్త నెమ్మదిగానే వ్యూస్ ని రాబట్టినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ముదులిపేసింది. ఈ పాట విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఎక్కడ చూసినా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అంటూ వినిపించేది. ఇక తాజాగా ఈ పాట మరో సంచలనాన్ని క్రియేట్ చేసింది. యూట్యూబ్లో సెన్సేషనల్ హిట్ అయిన బుట్ట బొమ్మ సాంగ్ ఏకంగా 700 మిలియన్ క్లబ్ లో చేరింది.

 తాజాగా ఈ పాట యూట్యూబ్లో 700 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగు సినిమాలోని మరే పాటకు సాధ్యం కానీ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంతటి అద్భుతమైన రికార్డును సృష్టించిన ఈ పాటపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో అత్యంత వేగంగా 700 మిలియన్ న్యూస్ దక్కించుకున్నా తొలి పాటగా బుట్ట బొమ్మ చరిత్ర సృష్టించింది. ఇక తమన్ సంగీత సారధ్యంలో అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటతో పాటు సినిమాలోని రాములో రాముల సుమారు 450 మిలియన్ల వ్యూస్ ని రాబట్టగా.. సామజ వర గమన పాట కూడా 239 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను దక్కించుకుంది. మతానికి తమని కెరియర్ లోనే ఇది బెస్ట్ ఆల్బమ్గా అల వైకుంఠ పురం లో సినిమా పాటలు నిలిచాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: