తెలుగు హీరోలు టాలీవుడ్ లో సక్సెస్ అందుకుని వరుస సినిమాలతో బిజీ అయ్యారు అంటే గొప్ప విషయమే. కానీ ఇతర భాషల హీరోలు తెలుగు ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని అందుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. కంటెంట్ తో పాటు హీరో యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇటువంటి అద్భుతాలు జరుగుతుంటాయి. అందులోని తెలుగు ప్రేక్షకులకు తెలియని ఇతర భాషా హీరో అయితే అది మరో విశేషం. ఇటువంటి అరుదైన గుర్తింపుని పొందారు. ఇతడు కన్నడ హీరో అన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ లు ఇక్కడ టాలీవుడ్ లో పాపులర్ అవడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది ఒకే ఒక్క సినిమాతో టాలివుడ్ బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసి తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన గా మార్చుకున్నాడు ఈ శాండిల్ వుడ్ హీరో యశ్.

ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు వెండి తెరపై విడుదలయిన కేజిఎఫ్ మూవీ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీ తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఊహించని ఇంపాక్ట్ చూపింది. స్టోరీ ఎంత బలంగా అయితే ఉందో, హీరో నటన అంతకు మించిన స్థాయిలో ఉంది. ఈ సినిమాలో యశ్ చూపించిన వేరియేషన్స్ వేరే లెవల్ అనే చెప్పాలి. సైలెంట్ గా వచ్చిన ఈ యంగ్ హీరో ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ గా ఎదిగి సత్తా చాటాడు. పాటలు కూడా హైలెట్ గా మారి సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ యొక్క స్టామినా ఏంటో అన్న విషయం అర్థమైపోతుంది.

ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి వచ్చి ఈ చిత్రంతో యశ్  తెలుగులో క్రేజీ హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు.  ఒక్కసారిగా టాలీవుడ్ లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ కేజిఫ్ చాప్టర్ 2 తో బిజీగా ఉన్నారు యశ్. త్వరలో ఈ సినిమా మన మన ముందుకు రానుంది. ఈ ఒక్క సినిమా తన కెరియర్ నే మార్చేసిందని చెప్పాలి. అంతకు ముందు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించే యశ్ పేరు కే జి ఎఫ్ మూవీ తర్వాత ఇతర ఇండస్ట్రీలోను మారుమ్రోగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: