బాషా సినిమా రజినీకాంత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దీంతో రజనీకాంత్ కు కథలు రాయాలంటే రచయితలకు కత్తి మీద సాములా గా మారింది. ఇక రజనీకాంత్ ఇమేజ్ తగ్గట్టుగా తనను చూపించాలంటే డైరెక్టర్లకు పెద్ద సవాల్ గా మారింది. అందుకోసం రజినీకాంత్ ఒక టీములు పెట్టుకొని తన కోసమే కథలను రాయించడం మొదలుపెట్టారట. ముత్తు సినిమాతో జపాన్లో కూడా ఆయనకు అభిమానులు పెరిగిపోయారు.


నరసింహ సినిమా డైరెక్టర్ చిరంజీవితో కలిసి స్నేహం కోసం సినిమాను కూడా తెరకెక్కించారు. ఆ సమయంలోనే నరసింహ సినిమాని చేయబోతున్నామని అనౌన్స్మెంట్ కూడా చేశారట. ఈ స్టోరీని తమిళనాడులోని ఒక నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగిందట. మొదటిసారిగా నీలాంబరి అనే టైటిల్ పెడదామనుకున్నారట. రజనీకాంత్ కూడా ఒప్పుకున్నాడు.కానీ రజినీకాంత్ ఫ్యాన్స్ తో ఇబ్బంది పడతామని తెలుసుకుని చిత్ర యూనిట్ సభ్యులు నరసింహా గా మార్చారు. ఇక ఈ సినిమాలోని పాత్రల కోసం 11మంది హీరోయిన్లను పరిశీలించారట.

ఐశ్వర్యరాయ్, మీనా, నగ్మా వంటి హీరోయిన్లు కూడా అడగగా.. అంతటి స్థానం కలిగిన నటన ముందు మేము ఎలాంటి ఇ పర్ఫార్మెన్స్ చేయలేమని తెలియజేశారట. చివరికి రమ్యకృష్ణ నీలాంబరి పాత్రను ఛాలెంజ్గా తీసుకుని ఒప్పుకుందట. అయితే సౌందర్య పాత్రకు ముందుగా అనుకున్న హీరోయిన్ సిమ్రాన్ అట. కానీ ఆ తర్వాత మీనా నీ కూడా అనుకున్నారు, కానీ చివరకి సౌందర్యాన్ని తీసుకోవాల్సి వచ్చిందట. ఇక రజనీకాంత్ స్వయంగా తన తండ్రి పాత్రలో శివాజీ గణేషన్ నే తీసుకోవాలని చెప్పారట. ఇదే ఆయన చివరి మూవీ.


ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు. చివరిగా క్లైమాక్స్ కోసం రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నారు. 90 రోజులలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. రజినీకాంత్ రెమ్యూనరేషన్ ఒక్క రూపాయి కూడా అందులో లేదట. ఇక సినిమాలో కూడా తన ది ఒక భాగం అన్నట్లుగా ఒప్పుకున్నాడట. ఇక దాంతో ఈ సినిమా దాదాపు 55 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: