తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమాని ఒక్కో విధంగా తెరకెక్కించాలని అంటే వాటి వెనక ఎంతో కష్ట ఫలం ఉంటుంది. అందులో ఎంతో మంది టెక్నీషియన్స్ పని చేస్తే గాని ఆ సినిమా అలా కుదరదు. ఇక దర్శకులు, నటీనటులు ఎంతో కష్టపడి పని చేస్తే కానీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలా ప్రేక్షకులను బాగా కావాల్సినంత వినోదాన్ని ఇస్తున్నాయి సినిమాలు. అయితే ఇదే క్రమంలో ని ఎంతో మంది హీరోలు మూవీలు దాదాపుగా వెయ్యి రోజుల వరకు ఆడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అంతగా తమ హీరోల సినిమాలు ఆదరించే వారు అభిమానులు.పోకిరి మూవీ థియేటర్ లలో వెయ్యి రోజుల వరకు నిలబడి ఒక రికార్డు సృష్టించింది. కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా లెజెండ్ సినిమా కూడా 1005 రోజులు కూడా ఆడి మరొక రికార్డును సాధించింది. ఇక మనసంతా నువ్వే సినిమా కూడా 205 రోజులు, నువ్వే కావాలి 200 రోజులు ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లలో ఆడి ప్రేక్షకులకు కనువిందు అందించాయి. అయితే అప్పట్లో ఇలా ఎన్నో రోజులు ఆడే వి సినిమాలు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లో ఒక్కో సినిమా కేవలం ఒక వీక్ ఆడడమే కూడా గగనం గా మారిపోయింది. అందుకు ముఖ్య కారణం ఏమిటనే విషయం ఇప్పుడు చూద్దాం.

అప్పట్లో సినిమా విడుదల అవుతుంది అంటే అది కేవలం థియేటర్లలో మాత్రమే.. ఆ సినిమా విడుదలైన తరువాత బుల్లితెరపై కనిపించాలంటే కనీసం ఒక సంవత్సరం పట్టేది. అందుచేతనే సినీ ప్రేక్షకులంతా అక్కడికి వెళ్లేవారు. కానీ టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరగడంతో సినిమాని కేవలం వారం రోజులకే ఓటీటీ, ఫైరసీ వంటి ప్రింట్స్ బయటికి రావడం వల్ల చాలామంది థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు.అందుచేతనే ఇప్పుడు ఎటువంటి సినిమా అయిన ఒక నెల కూడా ఆడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: