సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది చాలా రోజుల ప్రయత్నం తర్వాత సక్సెస్ అవుతూ ఉంటారు. కొంత మంది మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ లుగా వెలిగి పోతూ ఉంటారు. ప్రస్తుతం ఒకే ఒక్క పాట తో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్. ఒకే ఒక్క పాట తో ఇంద్రావతి చౌహాన్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఊ అంటావా మామ ఊఊ అంటావా.? మావ అంటూ ఓ నిశా గొంతుతో అందరినీ కట్టిపడేసింది సింగర్ ఇంద్రావతి చౌహాన్. పాట పాడటం ఒకెత్తు అయితే... లిరికల్ వీడియో లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మరో ఎత్తు. పుష్ప లిరికల్ సాంగ్ లో ఒకే ఒక్క షాట్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సింగర్ ఇంద్రావతి పేరే వినబడుతోంది. మొన్న జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మంగ్లీ పాడిన లైవ్ పాట, ఆమె సోదరి పాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగ్లీ చెల్లగా మాత్రమే కాకుండా ఇంద్రావతి ఒక సింగర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

చెల్లకు ఇంతటి సక్సెస్ రావడంతో మంగ్లీ చాలా ఆనంద పడుతుంది. ఈ క్రమంలో మంగ్లీ, చెల్లెలు పై ఎమోషనల్ అయ్యింది. ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ అనే సాంగ్ ఇంతటి పెద్ద సక్సెస్ అవ్వడం చాలా ఆనందం గా ఉంది. కంగ్రాట్స్ ఇంద్రావతి, నీ డెబ్యూ తోనే ఇంతటి స క్సెస్ అందుకున్నావ్... ఇక మున్ముందు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందు కోవాలి.. దేవీ శ్రీ ప్రసాద్ సర్, సుకుమార్ సర్, అల్లు అర్జున్ సర్ ఇలా అందరికీ థ్యాంక్స్ అని సింగర్ మంగ్లీ తన ఆనందాన్ని పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: