ఒక సినిమా కి దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం మొదలు పెట్టిన దగ్గర నుంచి విడుదలయ్యే అంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో భారాన్ని మోస్తూ పని సక్రమంగా అయ్యేలా చూసుకోవాలి. అందుకే  సినిమాకు దర్శకుడు గా చేయడం ఎంతో కష్టమైన పని. ఆ విధంగా పాన్ ఇండియా సినిమా కు దర్శకత్వం వహించడం ఇంకా కష్టమైన పని. తెలుగు లో ఈ పాన్ ఇండియా సినిమా లు బాగానే తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి  ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప చిత్రం.

సినిమా ను ఎంతో సమర్థవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. దర్శకుడిగా తనను తాను నిరూపించు కావాల్సిన అవసరం లేకపోయినా రంగస్థలం లాంటి హిట్ తర్వాత ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ సక్సెస్ సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్లు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా భారీ సక్సెస్ సాధించింది.

అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీగా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించబోతుంది అని చెబుతున్నారు. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ సినిమాలో ఆయన తర్వాత హీరో స్నేహితుడు గా నటించిన జగదీష్ కేశవ పాత్ర విపరీతంగా ఆకట్టుకుంది. అందరూ కూడా సినిమా లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా నటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా సుకుమార్ దర్శకత్వం కు ఆయన టాలెంట్ కు నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: