ప్రస్తుతం థియేటర్లో ఓ రేంజ్ లో సందడి చేస్తున్న సినిమా ఏంటంటే పుష్ప . పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారట.

ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడట.. ఇక రష్మిక మందన మాత్రం తన కట్టు బొట్టుతో పల్లెటూరి అమ్మాయి గా ఆకట్టుకుందట . ఇక సమంత ఎంట్రీ కూడా ఉండటంతో ప్రేక్షకులు చాలా వరకు సమంత డాన్స్ కోసం మరియు ఐటెం సాంగు కోసం కూడా సినిమా చూడటానికి వెళ్లారట.. ఈ సినిమాలో నిజానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత నిలిచిందని తెలుస్తుంది.. పైగా 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే ఈ ఐటెం సాంగ్ విడుదలైన క్షణంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిందట.సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహన్ ఈ పాట పాడగా తొలి పాటతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిందట.. మంగ్లీ కూడా ఈ పాటను కన్నడ భాషలో పాడిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ పాటకు అన్ని భాషల కంటే తెలుగు లోనే ఎక్కువ ప్రశంసలు వచ్చాయట . మొత్తానికి ఈ పాట యూట్యూబ్ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తుందట చాలామంది ఈ పాటకు తెగ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారట.. కానీ ఓ వైపు ఈ పాట లోని పదాలు తమను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ కొన్ని పురుష సంఘాలు రంగంలోకి దిగాయట..

ఈ పాటను విడుదల చేయొద్దు అని సినిమా విడుదల ముందు తెగ వాదనలకు దిగారట. పైగా కేసు కూడా పెట్టారట. దీంతో ఈ పాట సినిమాలో ఉంటుందా ఉండదా అని అభిమానులు చాలా కంగారు పడ్డారట.. సినిమా విడుదలై అందులో ఈ పాట వచ్చే వరకు ప్రేక్షకులకు ఈ పాట పై నమ్మకం లేకుండా పోయిందని తెలుస్తుంది. అంటే చాలామంది ప్రేక్షకులు ఈ పాట కోసం కూడా సినిమాకు వచ్చిన వాళ్లు ఉన్నారని తెలుస్తుంది.మొత్తానికి సమంత పాట ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈ పాట వచ్చిన వెంటనే ఈలలతో మరియు గోలలతో థియేటర్ లలో మొత్తం తెగ సందడి చేశారట.నిజానికి ఈ పాటలో పురుషులను ఉద్దేశించిన పదాలే ఉన్నాయని తెలుస్తుంది.మగాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అని కొన్ని పదాలు జోడించారట.. దీంతో పురుష సంఘాలకు ఈ పాట నచ్చలేదని కానీ అల్లు అర్జున్ మాత్రం నిజంగానే మగాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడట.. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడట బన్నీ దీంతో రిపోర్టర్ అల్లు అర్జున్ ను.. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్స్ పై వస్తున్న వివాదాలపై స్పందన ఏంటి అని అడగటంతో.. 'లిరిక్స్ లో తప్పులేదni ఇదే నిజం' అంటూ ఓపెన్ కామెంట్ చేశాడట బన్నీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: