నట విశ్వరూపం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని మాస్, క్లాస్ ఆడియన్స్ చేత మెప్పు పొందారు. ఫ్యామిలీ ఎంటర్‌ట్రైన్‌మెంట్, మాస్ యాక్షన్స్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. ఇటు సినిమాల్లో అటూ టీవీ రియాలిటీ షోలల్లో కనిపిస్తున్నారు. బిగ్‌బాగ్ వంటి తెలుగు రియాలిటీ షోలో నాగార్జున హోస్ట్ గా కొనసాగిస్తున్నారు. అలా తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తూ అలరిస్తున్నారు. ఇంత వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.


కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అయి ఎన్నో ఏళ్లు గడిచింది. ప్రస్తుతం ఆయనకు 60 ఏళ్ల వయసున్నా కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమా చేస్తుంటారు. ఇటీవల విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. తాజాగా ‘బంగార్రాజు’ సినిమాలో ముందుకు రానున్నారు. అయితే బంగార్రాజు సినిమాలో రమ్యకృష్ణ, నాగ చైతన్య నటించనున్నట్లు సమాచారం. నాగార్జున సరసన రమ్యకృష్ణ.. నాగ చైతన్య సరసన కృతిశెట్టి నటించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతున్నాయి.


అయితే తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ షోటోలో ఇప్పటి స్టార్ హీరో ఉన్నారు. అది ఎవరంటే మన కింగ్ నాగార్జునే. నాగార్జున తన చిన్నప్పటి షోటో నెట్టింట వైరల్ కావడంతో అటు అభిమానులు, ఇటు నాగ్ పాన్స్ పండగ చేసుకుంటున్నారు.  చిన్నప్పటి ఫోటోలో నాగార్జున ఎంత క్యూట్‌గా ఉన్నాడంటూ ఫ్యాస్ తెగ వైరల్ చేస్తున్నారు. కాగా.. కరోనా లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా విస్తృతం అయింది. అభిమానులు తమ హీరో, హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు.. అందరికీ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులకు షేర్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: