రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో యువత పెళ్లి అంటేనే పారిపోతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు వచ్చి పెళ్లి చేసుకోరా వయసు దాటిపోతుంది అని పదే పదే చెప్పినా కూడా అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూయించట్లేదు. పెళ్లి అయితే ఫ్రీడం పోతుందని భయమో..లేక బ్యాచిలర్ లైఫ్ నే బాగుంది అని అనుకుంటున్నారో తెలియదు కానీ పెళ్లి అంటే భయపడుతున్నారు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్లు వయసు అయిపోయాక పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అంటూ కూడా పెద్ద వాళ్లు అరుస్తుంటారు. కానీ యంగ్ బ్లడ్ కదా తమ ఆలోచనలే కరెక్ట్ అనుకుంటారు యువత. కొన్ని రోజులు గడిచాక వాళ్లకే అర్ధమౌతుంది.

ఇక ఇలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో స్టార్ హీరోలు కూడా ఉండడం గమనార్హం. బ్యాచిలర్ అనగానే మనకు ముందు గుర్తు వచ్చే పేరు ఆరు అడుగుల అందగాడు ప్రభాస్. ఈయన పెళ్లి చేసుకుంటే చూడాలి అని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పరే. అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా అని కుడా డౌట్లు వచ్చేలా చేస్తున్నాడు  ప్రభాస్. గ్యాప్ లేకుండా వరుస పాన్ ఇండియా మూవీలకు సైన్ చేస్తూ కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడే కానీ పరసనల్ లైఫ్ ని పట్టించుకోవడం లేదు.

ఇక టాలీవుడ్‌లో మరో మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకరు. అద్దిరిపోయే కటౌట్ ..చూడగానే ఆకట్టుకునే అందం..అంతకంటే మంచి మనసు ,టాలెంట్ ఉన్న ఈ హీరో కూడా పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఎప్పటి నుండో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా ఇప్పటికి వాళ్ళ కల నెరవేరబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యుల్లో ఈ యంగ్ హీరో మాట్లాడుతూ పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు. " ఇంట్లో ఎప్పటినుండో పెళ్లి చేసుకో అని చంపేస్తున్నారు. కానీ నేను వినలేదు. నా కెరీర్ , సినిమాల పై ఫోకస్ చేసా. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది.  నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై గాలి మళ్లిన్నట్లు ఉంది. నాకంటూ ఒక పరసనల్ లైఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. దీని బట్టి ఈయన త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేటట్లు ఉన్నారు అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: