ప్రతి సినిమాలో కథాంశం ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. సినిమాలోని పాటలు సినిమాకి అసలు సిసలైన ప్రాణం అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. ఇది నిజమే అని నిరూపించేందుకు కేవలం పాటలతోనే మంచి విజయాన్ని సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుడిని మదిని తాకింది అంటే ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్లే అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ఇక ఇది ఎన్నో సినిమాల విషయంలో నిజమైంది.


 ఇక పోతే ఇక మరికొన్ని రోజుల్లో 2021 ఏడాది ముగిసిపోతుంది దీంతో అందరూ గడిచిన ఏడాది కి ముగింపు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిలో ఎక్కువగా ప్రేక్షకులను అలరించిన పాటలు ఏవి అని ఎంతోమంది వెతకడం ప్రారంభించారు మరియు ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.


' క్రాక్' బూమ్ బద్దలు : ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కూడా ఒకటి  సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా  భూమ్ బద్దలు అంటూ సాగే ఐటమ్సాంగ్ అయితే ప్రతి ప్రేక్షకుడిని ఆకర్షించింది. పాటలో అప్సర రాణి డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు.


' ఉప్పెన' నీ కన్ను నీలి సముద్రం : సినిమాకు ప్రాణం పోసేది పాట. ఇక ఇలా ఉప్పెన సినిమాకు ప్రాణం పోసింది నీ కన్ను నీలి సముద్రం పాట. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్లో కూడా ఎన్నో రికార్డులు కొట్టింది ఈ పాట. ఈ ఒక్క పాటే కాదు సినిమాలోని ప్రతి పాట కూడా ప్రేక్షకుడిని మెప్పించింది.


 నీలి నీలి ఆకాశం : యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లో నీలి నీలి ఆకాశం పాట అద్భుతాన్ని సృష్టించి అందరిని  ఆకర్షించి అందరి నోళ్లలో నానింది. ఈ సినిమాకు రామజోగయ్యశాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి.


 చిట్టి నీ నవ్వంటే : చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నిరూపించింది జాతి రత్నాలు. ఈ సినిమాలో చిట్టి నీ నవ్వంటే అనే పాట సూపర్ హిట్ అయ్యింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది ఈ పాట.


 సారంగదరియా : కనుమరుగవుతున్న జానపదానికి మెరుగులు దిద్ది మరోసారి తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేశాడు శేఖర్ కమ్ముల. లవ్ లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయిగా మంగ్లీ పాట పాడింది. ఈ పాట ఏకంగా 400 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతుంది.


 లెహేరాయి : సినిమా లో ఎన్ని పాటలో ఉన్న మెలోడీ సాంగ్స్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు లెహరాయ్ పాట అద్భుతంగా యూత్ ను ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ వాయిస్ అందరిని మంత్రముగ్దుల్ని చేసింది.


 లాహే లాహే : సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో పాటలు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నుంచి విడుదలైన లాహే లాహే పాట ఎంతగానో ఆకట్టుకుంది. మణి శర్మ  ఈ పాటకు మ్యూజిక్ అందించారు. ఇక ప్రతి ఒక్కరిని ఈ పాట ఆకట్టుకుంది అని చెప్పాలి.


 ఊ అంటావా ఉహూ అంటావా : భారీ అంచనాల మధ్య తెరకెక్కింది పుష్ప సినిమా. ఈ సినిమాలో మిగతా పాటలు ఎలా ఉన్నా అటు సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఉహూ అంటావా మాత్రం అందరికీ మత్తెక్కించింది అని చెప్పాలి.  ఇక ఈ పాటను అటు మంగ్లీ చెల్లెలు పాడటం గమనార్హం. ఇక ఇదే సినిమాలోని శ్రీవల్లి పాట అందరిని పులకరింప చేసింది.


 యా యా జై బాలయ్య : బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలోని జై బాలయ్య పాట అభిమానులను ఉర్రూతలూగించింది అని చెప్పాలి. ఈ పాట కూడా తమన్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడు. ఇక ఈ పాటపై నందమూరి బాలకృష్ణ అదిరిపోయే డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.



 మగువ మగువ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో మగువ మగువ అనే పాట ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆడవాళ్ల గొప్పతనాన్ని తెలుపుతూ సాగిపోయే ఈ పాట యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టించింది..


 ఒకే ఒక లోకం నువ్వు : సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శశి సినిమా ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలోని ఓకే ఓకే లోకంలో అనే పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది చెప్పాలి. సిద్దు శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ ని ప్రేమ లోకం లో మునిగి తేలేలా చేసేది.

మరింత సమాచారం తెలుసుకోండి: