టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు,  ఈ సినిమాలో నాగ చైతన్య సరసన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది, బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు చిత్ర బృందం తెలియజేసింది, అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని ఆ ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ కావడమే, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన మెలోడీ సాంగ్ నాకోసం మారవా.. నువ్వు అనే పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలాజీ సాహిత్యాన్ని అందించిన సాంగ్ ను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో మరు మ్రోగుతుంది. ఈ సాంగ్ ట్రెండింగ్ లో నిలుస్తూ, 7 మిలియన్ పైగా వ్యూస్ ను రాబట్టింది, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: