టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన ఈ భామ.. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పేరే 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరీ - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఇక సమంతతో పాటు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్రను చేయబోతుంది అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'యశోద' ఫిమేల్ సెంట్రింగ్ సినిమా కావడంతో కథ మొత్తం సమంత చుట్టూరానే తిరుగుతుందట. అందుకే ఈ సినిమాలో తన పాత్ర విషయంలో సమంత చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత తొలిసారి 'నర్స్' పాత్రలో కనిపించనుందట. అంతే కాదు ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా అని.. ఇందులో కొన్ని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఇక సినిమాలో యశోదా గా సమంత చేసే పాత్ర చాలా షాకింగ్ గా ఉంటుందని.. తెలుగు తెర పైన ఇప్పటి దాకా అలాంటి ఒక పాత్రను ఎవరు పోషించలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.

గతంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటి వరకూ హీరోయిన్ గా తన కెరీర్లో సమంత నర్స్ పాత్ర చేయలేదు. ఇప్పుడే యశోద  సినిమాలో నర్స్  గా కనిపించనుండడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: