సినీ సెలబ్రిటీలు అదే ఇండస్ట్రీలో వారిని ప్రేమించి పెళ్లిచేసుకోవడం అంటే చాలా సర్ ప్రైజింగ్ గా , సంతోషంగా ఉంటుంది. తమ అభిమాన తారలు ఇరువురు ఒకటి కాబోతున్నారు అంటే అభిమానులకు అంతకు మించిన పెద్ద ఆనందం మరొకటి ఉండదు. అయితే తాజాగా మరో సెలబ్రిటీ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు అని ఫిల్మ్ నగర్ నుండి టాక్ వినపడుతోంది. ఇంతకీ ఆ సెలబ్రిటీలు మరెవరో కాదు అటు బాలీవుడ్ కి ఇటు టాలీవుడ్ కి సుపరిచితురాలు అయిన కియారా అద్వానీ మరియు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ద్ మల్హోత్రా.

వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుండగా ఇపుడు వీరు త్వరలో పెళ్లికి రెడీ అని, వీలైనంత త్వరలోనే వీరు పెళ్లిచేసుకోబోతున్నారు అని సమాచారం. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వచ్చే ఏడాది లోనే వీరు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి అవనున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వార్తలు వెలువడుతున్నాయి.
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు యంగ్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ అంతే క్రేజ్ తో దూసుకుపోతున్నారు.

కాగా ఇటీవలే బాలీవుడ్ ప్రేమ పక్షులు ఆలియాభట్, హీరో రణభీర్ కపూర్ లు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది. వీరి వివాహం కూడా రానున్న నూతన సంవత్సరంలో ఉండబోతుంది అని అంటున్నారు. కాగా సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ యువ హీరో విక్కీ కౌశల్ లు ఈ మధ్యనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే లా జరగడం పరిపాటే అయినా పెళ్లయ్యాక వీరు వందేళ్లు కలిసి ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే సెలెబ్రిటీలు అంతా కూడా ఏదో వయసు వేడిలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు తర్వాత వివిధ కారణాలతో విడిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: