

అమర్ రాజా మీడియా వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకింత ఆనందాన్నిచ్చే విషయం అనే చెప్పాలి. ఒకరకంగా ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తారు అనుకుంటే ఫైనల్ గా ఆయన మేనల్లుడి సినిమా వస్తుండడం ఆనందంగా ఉందని, తప్పకుండా అశోక్ నటిస్తున్న ఫస్ట్ మూవీ హీరో సూపర్ హిట్ కొట్టి తీరుతుందని పలువురు ఘట్టమనేని అభిమానులు అతడికి ముందస్తుగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీపై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. మరి ఫస్ట్ సినిమాతో మహేష్ మేనల్లుడు అశోక్ ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.