గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే కరోనా కారణంగా పరమపదించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో గాయకుడిగా తనదైన ముద్ర వేసుకుని ప్రేక్షకులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగా ఆయన ఎన్నో మెట్లు అధిరోహించ గా ఆ పాటల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు అని చెప్పొచ్చు. ఆయన గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులను చాలావరకు సంతృప్తిపరచాడని చెప్పవచ్చు. ఎన్నో ముఖ్యమైన పాత్రలో కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు బాలసుబ్రహ్మణ్యం.

అలాంటి బాలసుబ్రహ్మణ్యం కు ఎంతో మంది దర్శకులు వెన్నంటి నిలిచి ఆయనకు అవకాశాలు ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగాను అని ఆయన స్వయంగా చెప్పడం అప్పట్లో విశేషంగా మారింది. దర్శకులు హీరోలు తన మీద నమ్మకం ఏర్పరుచుకున్నారు కాబట్టే తాను ఒకే సినిమాలో అన్ని పాటలు పాడే స్థాయికి ఎదగ గలిగాను అని ఆయన అన్నారు. అలా ఆయన తన పాట లను ఎక్కువగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాలలో పాడటం విశేషం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో తప్పకుండా అన్ని పాటలు బాలసుబ్రహ్మణ్యం మాత్రమే పాడేవారు. అలా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

తెలుగు ప్రేక్షకుల సంస్కృతి సాంప్రదాయాల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను చేసి ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్వనాథ్  దర్శకత్వంలో సినిమా లోని అన్ని పాటలను కూడా బాల సుబ్రహ్మణ్యం పాటలు పాడటం విశేషం. అలాంటి వీరిద్దరి మధ్య బంధం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. వీరిద్దరు మామ అల్లుడు అవుతారట. అంతేకాదు చంద్ర మోహన్ కూడా విశ్వనాథ్ కు అల్లుడే అవుతాడు. మరి ఈ విధంగా వీరికి ఉన్న బందుత్వం ఎవరికీ తెలియకుండా ఉంది. బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన సమయంలోనూ వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని వీరు పంచుకుని కంటతడి పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: