తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవికి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా మాత్రం 'ఖైదీ'. అప్పటివరకూ చిరు నటించిన సినిమాలు ఒక ఎత్తయితే.. ఈ సినిమా మరో ఎత్తు అయింది. 1983 వ సంవత్సరంలో ఏ కోదండరామి రెడ్డి డైరెక్షన్లో సంయుక్త మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించగా చిరు కి జోడిగా సుమలత, మాధవి హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాకి చక్రవర్తి అందించిన మ్యూజిక్ అప్పట్లో అదరగొట్టేసింది.

ఇక విడుదల తర్వాత ఈ సినిమా 20 సెంటర్లలో 100 రోజులు, 6 సెంటర్లలో ఏకంగా 200 రోజులు ఆడింది. అప్పట్లో సుమారు 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ఏకంగా మూడు కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక ఖైదీ సినిమాకు రెండు వారాల ముందు మోహన్ బాబు నటించిన కాల యముడు సినిమా వచ్చింది  ఈ సినిమాలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో నటించాడు. అయితే ఈ సినిమా మాత్రం మోహన్ బాబుకి నిరాశనే మిగిల్చింది. ఖైదీ సినిమా కి ఎనిమిది రోజుల ముందు సింహపురి సింహం అనే సినిమా వచ్చింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుతుంది. 

ఇక ఖైదీ సినిమా విడుదలైన వారం తర్వాత బాపు దర్శకత్వం వహించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమా రిలీజ్ అయింది. ఒకపక్క ఖైదీ సినిమా విజయవంతంగా ఆడుతున్నా.. మరోపక్క ఈ సినిమా కూడా ఆడియన్స్ ని మెప్పించింది. అలా ఖైదీ విడుదలైన ఆ నెలలో చాలా సినిమాలు విడుదలయ్యాయి.. కానీ వాటన్నింటికి మించి ఖైదీ సినిమా సంచలన విజయం అందుకొని అప్పట్లోనే 3 కోట్ల వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, బోలా శంకర్ వంటి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు చిరంజీవి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: