టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. కానీ, అల్లు అర్జున్ దెబ్బ‌కో లేక‌ వారి దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ.. ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. ఇక ఆల‌స్య‌మెందుకు అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్లు ఎవ‌రు..? వారి కెరీర్ ఎలా సాగింది..? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.
అల్లు అర్జున్ హీరోగా కె.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `గంగోత్రి`. 2003లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. కానీ, ఈ సినిమాతో ప‌రిచ‌యం అయిన ఆర్తి అగ‌ర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ రెండు, మూడు చిత్రాల‌కే ఇండ‌స్ట్రీని వ‌దిలేసింది.
అల్లు అర్జున్ రెండో చిత్రం ఆర్య సినిమాతో అనురాధ మెహతా అనే హీరోయిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆర్య‌ చిత్రం మంచి విజ‌యం సాధించినా అనురాథ మెహ‌తా ఎక్కువ సినిమాలు చేయ‌కుండానే సినీ ప‌రిశ్ర‌మ‌కు గుడ్‌బై చెప్పింది.
అల్లు అర్జున్ మూడో చిత్రం `బన్నీ`. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో గౌరీ ముంజాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమా త‌ర్వాత గౌరీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టించినా చివ‌ర‌కు ఫేడ‌వుట్ హీరోయిన్‌గా మిగిలి పోయింది.
అల్లు అర్జున్‌, గుణశేఖర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `వ‌రుడు`. ఈ చిత్రం ద్వారా భానుశ్రీ మెహ్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత భానుశ్రీ మెహ్రా తెలుగుతో పాటు త‌మిళ్‌, పంజాబీ, క‌న్నడ చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. ఆమె కెరీర్ క్ర‌మంగా డౌన్ ఫాల్ అయిపోయింది.
 ఇక అల్లు అర్జున్ న‌టించిన `ప‌రుగు` చిత్రంతో షీలా, `వేదం` సినిమాతో దీక్షా సేథ్‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. కానీ, వీరిద్ద‌రు సైతం టాలీవుడ్‌లో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక సినిమాల‌కు బై బై చెప్పేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: