
ఇక కాజల్ అగర్వాల్ కేవలం చిరంజీవి, రామ్ చరణ్ తో మాత్రమే కాకుండా ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు ప్రముఖ జ్యువెలరీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది. ఇక రెక్సోనా వంటి సబ్బు ఉత్పత్తులకు , కోల్గెట్ వంటి ఉత్పత్తులు కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసి అటు సినిమాల ద్వారా ఇటు వాణిజ్య ప్రకటనల ద్వారా బాగానే సంపాదించింది కాజల్ అగర్వాల్. ఇకపోతే ఈమె ఆస్తులు ఎంత ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈమె మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం సినిమా తో ఏకంగా రూ.23.5 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. మిగతా వాణిజ్య ప్రకటనలు ద్వారా సంవత్సరానికి రూ.80 లక్షల ఆదాయం పొందుతోంది. ఇక కాజల్ దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. ఆడి A3 ధర రూ.29.60 లక్షలు, టోయోటా ఫార్చ్యూన్ రూ.30.60 లక్షలు, స్కోడా సూపర్బ్ ధర రూ.31.80లక్షలు..నివాసస్థలం ముంబై లో వున్న ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో కలదు.దీని ధర సుమారుగా రూ.1.10 కోట్లు..ముంబై లో గుర్గాన్ లో రూ.10 కోట్ల విలువ చేసే ఇల్లు కలదు.ఇక ఇతర ఆస్తులు చూసుకుంటే మొత్తంగా రూ.80 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.