తెలుగులో సంక్రాంతి పండుగ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. వచ్చి సంచలన విజయాలను అందుకున్నాయి. ఇదే తరహాలో మన సంస్కృతి , సాంప్రదాయాలు కట్టుబాట్లపై రూపుదిద్దుకున్న సినిమా శతమానంభవతి. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కి రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికన్నా బెస్ట్ చిత్రంగా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ ను అందుకుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా విడుదల ఒక ప్రయోగమనే చెప్పాలి. పెద్ద సినిమాల మధ్య విడుదలైన ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
 
ఫారిన్ లో సెటిల్ అయిన తమ పిల్లలను వారి పిల్లలను సంక్రాంతి పండుగకు ఎలాగైనా తమ సొంత ఊరుకు రప్పించి తమ కుటుంబంతో కలసి సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న తల్లి తండ్రుల ఆకాంక్ష మెయిన్ లైన్. తెలుగు వారి కట్టుబాట్లను, సంక్రాంతి ప్రాముఖ్యతను, బంధాలు, బాంధవ్యాల విలువలను, గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో చక్కగా గొప్పగా.. చూపించారు. కథే ఈ సినిమాకి ప్రత్యేక బలం అని చెప్పాలి. ఈ చిత్రంలో సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లు చూపించారు. జయసుధ, ప్రకాష్ రాజ్, శర్వానంద్ ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్క నటీనటులు పాత్రలకు ప్రాణం పోశారు.

అయితే ఈ సినిమా కథను మొదట నితిన్ కు వినిపించినట్లు సమాచారం. అయితే కాన్సెప్ట్ నచ్చలేదో లేదా డేట్స్ అద్జుస్త్ కాలేదో తెలియదు కానీ ఆ తరవాత శర్వానంద్ చేతికి ఈ సినిమా వెళ్లినట్లు టాక్. ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే పండుగ సన్నివేశాలు,  క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనే చెప్పాలి. ఇక ఫ్యామిలీ డ్రామా అయినా కూడా సినిమాలో వీలైనంత మేర కామెడీ పండించడం బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ కెరీర్ మరింత ఊపందుకుంది. కానీ ఇప్పుడు వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: