దక్షిణాదిలో ఇప్పుడు
ధనుష్ ఐశ్వర్య విడాకుల అంశం పెద్ద సంచలనంగా మారింది. వీరు విడిపోవడానికి ఇద్దరి మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న గొడవలే కారణమని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని
ధనుష్ తండ్రి కస్తూరి రాజా చెన్నైలో ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.అంతే కాకుండా వీరిద్దరు మళ్లీ కలుస్తారని కూడా భార్యా భర్తలన్నాక గొడవలు అనేవి సహజమని అలాంటి గొడవల కారణంగానే విడిపోతున్నామంటూ ప్రకటించారని ఈ ప్రకటనకు ముందు
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇద్దరితో
ఫోన్ లో మాట్లాడి తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారని ఆయన స్పష్టం చేశారు. మరో పక్క
ధనుష్ ఇంకా ఐశ్వర్యల విడాకుల విషయం తెలిసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ నిర్ణాయన్ని పునరాలోచించాలని వారికి చెబుతున్నారట.ఇక ఇదిలా వుండగా ..హీరో
ధనుష్ పై
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించిన ఓ పాత వీడియో ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కాలా` చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజ్ పైకొచ్చిన రజనీ తన అల్లుడు బంగారం అని ఆయన్ని ప్రశంశించారు. `ధనుష్ ఎంతో అద్భుతమైన అబ్బాయి. తన తల్లిదండ్రులని చాలా గౌరవిస్తాడు. వాళ్లను దేవుళ్లలా భావిస్తాడు. తన భార్యను బాగా చూసుకుంటాడు. మంచి
తండ్రి మంచి అల్లుడు మంచి మనిషి మంచి ప్రతిభగలవాడు` అని పొగడ్తల వర్షం కురిపించారు
సూపర్ స్టార్ రజినీకాంత్.ఇక ఆ పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది.
ధనుష్ -
ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన సమయాన రజనీ `ధనుష్ మంచి వాడంటూ ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్ గా మారడం ఇప్పుడు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీరి విడాకుల విషయంలో
ధనుష్ ది ఎలాంటి తప్పులేదని చెప్పడం కోసమే
ధనుష్ అభిమానులు ఈ వీడియోని బాగా వైరల్ చేస్తున్నట్టుగా
కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.