మాస్ మహారాజ రవితేజ జన్మదినం నేడు కావడంతో ఆయన నటిస్తున్న మూడు సినిమాలైన రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ, ధమాకా సినిమాల నుండి మూడు అప్ డేట్స్ ని మూవీ యూనిట్స్ నేడు రిలీజ్ చేసాయి. అయితే వాటిలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్న ఖిలాడీ మూవీ ని రమేష్ వర్మ తీస్తుండగా కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అటు మాస్ రాజా ఫ్యాన్స్ తో ఆటు ఇటు ఆడియన్స్ లో కూడా ఖిలాడి మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

యువ భామలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్, టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ ఖిలాడీ మూవీ నుండి ఫుల్ కిక్ అనే పల్లవి తో సాగె మాస్ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. సాగర్, మమతా శర్మ ఎంతో అద్భుతంగా ఆలపించిన ఈ మాస్ సాంగ్ ని శ్రీమణి రచించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

గతంలో దేవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మాస్ సాంగ్స్ ని మించేలా మరింత ఊరమస్ స్టైల్ లో దేవి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో అలరిస్తోంది. ఇక ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, హీరో రవితేజ రెండు పాత్రల్లో తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఖిలాడీ మూవీ ద్వారా మాస్ మహారాజ్ రవితేజ ఎంత మేర సక్సె అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: