హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగులోనే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇతర భాషల్లోనూ పవన్ కు ప్రేక్షక అభిమానులు సంఖ్య ఎక్కువే. అయితే తెలుగులో తప్ప వేరే ఏ ఇతర చిత్రాల్లో పవన్ ఇప్పటి వరకు నటించింది లేదు. అయితే ఇపుడు పవన్ వేరే భాషలోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ సూపర్ హీరో అజిత్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసేందుకు కోలీవుడ్ డైరెక్టర్స్ పవన్ ను కోరగా పవర్ స్టార్ సరే అన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ సినిమా తెలుగులోను డబ్ కాబోతుండటంతో అన్ని విధాలుగా కలిసొస్తుందని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 'వకీల్ సాబ్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న డైరెక్ట్ మూవీ ఇదే. ఇక దీని కన్నా ముందే పవన్ భీమ్లా నాయక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇది మలయాళ రీమేక్ అని తెలిసిందే.

భీమ్లా నాయక్ మూవీ కూడా అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మాములుగా అయితే సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. ఏపీలో థియేటర్ టికెట్ల సమస్య మరియు రీసెంటుగా మళ్ళీ కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ రాకతో చిత్ర బృందం వెనకడుగు వేసింది. ఇప్పుడు ఫిబ్రవరి లో విడుదల చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: