రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఖిలాడి .. ఈ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించబడుతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ పాత్రలో నటించనున్నారు. హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ఈ సినిమాలు హీరో అర్జున్ సర్జ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే.. తాజాగా అర్జున్ కు సంబంధించి ఒక ఒక పాత్ర ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో అర్జున్ లుక్ ని విడుదల చేయడం జరిగింది.

ఇక అర్జున్ భరద్వాజ్ అనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ ఈ పాత్రలో చాలా కూల్ గా నటించనున్నాడు అన్నట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఇక పోస్టర్ విషయానికి వస్తే హీరో అర్జున్ తన చేతిలో గన్ను పట్టుకుని.. చాలా ఇంటెన్స్  స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక అంతే కాకుండా ఖిలాడి సినిమాలో అనసూయ భరద్వాజ్, ఉన్ని ముకుందన్, వెన్నెల కిషోర్, ముఖేశ్ రుషి, రావు రమేష్, నికితిన్ ధీర్, మురళి శర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, సచిన్ ఖేడేకర్ ఇక మరి కొంతమంది నటులు కొన్ని పాత్రలు పోషించనున్నారు. ఇక ఈ సినిమా కి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగానే అలరించే కనిపిస్తున్నాయి.

ఖిలాడి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ని జయంతి లాల్, సత్యనారాయణ కోనేరు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. సుజిత్ వాసుదేవ్, జీ.కే విష్ణు సినిమాటోగ్రఫీ గా అందించారు. ఆయర్ రెడ్డి ఈ సినిమాకి ఎడిటర్ వర్క్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఫిబ్రవరి 11న బ్రహ్మాండంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: