ఐశ్వర్య రాజేష్.. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ఈమె తండ్రి రాజేష్ కూడా ఒకప్పుడు తెలుగులో దాదాపు 50 చిత్రాలకు పైగా నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు . అంతేకాదు ఈమె మేనత్త ప్రముఖ సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఇక శ్రీ లక్ష్మి తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగా దగ్గర అయ్యింది అంటే ఇప్పటికి కూడా ఈమెకు అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు.. ఒకవైపు తండ్రి మరొకవైపు మేనత్త ఇలా అతిపెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య మాత్రం ఏ రోజు కూడా వీరి బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకోకుండా స్వతహాగా సినీ ఇండస్ట్రీలో ఎదిగింది.
ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్.. టక్కు జగదీష్.. భూమిక.. రిపబ్లిక్ వంటి చిత్రాలలో నటించినా.. ఒక్క సినిమా కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.. ఐశ్వర్య కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడం వల్లే ఈ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ కారణంగానే ఈమెకు సక్సెస్ రేటు పడిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఐశ్వర్యకు అవకాశాలు ఇవ్వడం లేదు..

ఐశ్వర్య రాజేష్ చేతిలో పెద్ద సినిమాలేవీ లేవు..ఇక తమిళంలో మాత్రం డ్రైవర్ జమున, మోహన్ దాస్ వంటి చిత్రాలను చేస్తోంది.. మరొకవైపు పులిమడ అనే మలయాళంలో  సినిమాలో కూడా నటిస్తోంది.. ఇకపోతే ఏదైనా ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ఈమెకు తెలుగులో అవకాశాలు రావనే చెప్పాలి.. కనీసం ఆ అదృష్టమైనా ఈమెకు దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: