కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులే. ఇటీవల రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య సినిమాలో విష్ణు ఒక ప్రధాన పాత్రణలు చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనులిపించుకున్నాడు. కథ ప్రేక్షకులకు చేరువ కాకపోవడంతో సినిమా కమర్సియల్ గా హిట్ కాలేకపోయింది. కాగా ప్రస్తుతం విష్ణు విశాల్ 'ఎఫ్‌ఐఆర్' అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాడు. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వయంగా విష్ణు విశాల్ నిర్మించడం విశేషం. మన టాలీవుడ్ హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయనుంది. కాగా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని న్యాచురల్ స్టార్ నాని రెండు రోజుల క్రితం విడుదల చేసి ఎఫ్ ఐ ఆర్ మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక అమాయకపు యువకుడి జీవితం అబూ బక్కర్ అబ్దుల్లా అనే టెర్రరిస్ట్ కారణంగా ఎలా మలుపు తిరుగుతుంది. ఎన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది, ఇర్ఫాన్ ఎలా ఎదుర్కుంటారు అన్నది ఈ ట్రైలర్ లో అర్దం అయ్యింది. కాగా ఈ ట్రైలర్ చూసాక సినిమా ఎలా ఉండబోతుంది అన్న గ్రాఫ్ అలా కనిపిస్తోంది. సినిమాలో రొటీన్ గా కాకుండా వైవిధ్యాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి ట్రీట్ అయ్యేలా ఉంది.

అలాగే ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. మరి ఇవన్నీ ఉండటంతో కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది అన్నది టాక్. ఇందులో ఒక అమాయక యువకుడిని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది తెరమీదనే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: