
పూర్తి వివరాల్లోకి వెళితే ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేస్తుండగా మీనాక్షి చౌదరి రోల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. అలాగే మీనాక్షి కూడా అంతకన్నా ప్రత్యేకంగా నటించారని కాదు కాదు జీవించారని టీం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో రవితేజ పాత్ర పూర్తి భిన్నంగా ఉండబోతుందని అలాగే ఆ పాత్రకు అనుసంధానంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ కూడా ఉండనుంది అని టాక్. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి మ్యాచ్ అవ్వడం కాదు ఆమె అందుకు పర్ఫెక్ట్ అనేలా ఉందని అంటున్నారు.
మరి సినిమా రిలీజ్ అయ్యాక మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటా ఆమె ఎలా నటించారు చూడాలి. అలాగే ఈ మూవీ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందనను దక్కించుకుంటున్నాయి. అలాగే సిల్వర్ స్క్రీన్ పై వీడియోతో మరింత దూకుడు పెంచుతాయని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.