టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం కిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎ ల్ పి స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు .దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఫిబ్రవరి 11 న విడుదల కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు బై ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం కిలాడి సినిమా రన్ టైం 2 గంటల 34 పాటు ఉంటుందని సమాచారం. ఐ సినిమా విడుదల కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్న సమయంలో సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. సాధారణంగా మన తెలుగు సినిమాలు పిఎస్ లో అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ అవుతాయనే విషయం తెలిసిందే. కానీ రవితేజ కిలాడి సినిమా యూఎస్ ప్రీమియర్ లేవని టాక్ వినిపిస్తోంది. సినిమా కంటెంట్ ఢిల్లీ కారణంగా కిలాడి సినిమాకి అక్కడ ఇబ్బందులు తప్పటం లేదు దు ఏ సినిమాకి యూఎస్ ప్రీమియర్ క్యాన్సిల్ అవడంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

అయితే దీనిపై ఇంకా మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కిలాడి ప్రీమియర్ క్యాన్సల్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఏ సినిమా అనుకున్న సమయానికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి భారీ రేంజ్ లో రెస్పాండ్ అవుతుంది ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ రొమాన్స్ కామెడీ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా బ్లాక్బస్టర్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి శుక్రవారం థియేటర్స్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: