వలిమై.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఎక్కువగా దొంగ పోలీస్ చేజింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ఇక ఇలాంటి సినిమాలు స్టార్ హీరోలు సైతం నటిస్తే ఆ కథ వేరే లెవెల్లో ఉంటుంది.ఇప్పుడు అలాంటి కథతోనే సినిమాని తెరకెక్కించారు.. ఆ సినిమా పేరే వలిమై.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో హీరో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కార్తికేయ ఒక దొంగ గా నటించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో కార్తికేయ ఒక రేసర్ గా కనిపిస్తాడు. ఇక ఈ మూవీలో అజిత్, కార్తికేయ లను ఏ సినిమాలో చూపించిన విధంగా చూపించారు డైరెక్టర్ హెచ్ వినోద్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.. దొంగతనాలు చేస్తూ పోలీసులను మట్టి కరిపించే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించాడు కార్తికేయ.. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో కార్తికేయ తమ గ్యాంగ్ తో  చేసే సీన్స్  ఈ సినిమాలో హైలెట్గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమాలో చేజింగ్ లు చూస్తే ధూమ్ సినిమా లోని తరహాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు డైరెక్టర్. ఇక ట్రైలర్ లో చూపించిన విధంగా అజిత్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. చివరిగా హీరో కార్తికేయ గేమ్ అయిపోలేదు అనే చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.దీన్ని బట్టి చూస్తే పార్ట్ 2 ఉండబోతోంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి 160 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఇక ఇందులో బోనీకపూర్.. జి సంస్థ వారు ఈ సినిమాని నిర్మాతలుగా వ్యవహరించారు. వాలిమై మూవీ ఈనెల 24వ తేదీన బ్రహ్మాండంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: